HomeMovie News Teluguశ్రీదేవి కోసం నాగార్జున త్యాగం

శ్రీదేవి కోసం నాగార్జున త్యాగం

నాగార్జున – రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్‌లుక్‌ ఈ ఆదివారం విడదుల కావాల్సి ఉంది. కానీ అదే రోజు అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది చిత్ర యూనిట్‌. రామ్‌గోపాల్‌ వర్మకు శ్రీదేవిపై ఉన్న ప్రత్యేక అభిమానం సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే నాగార్జున – శ్రీదేవి కలిసి వర్మ దర్శకత్వంలో ‘గోవిందా గోవిందా’ తదితర చిత్రాల్లో నటించారు. ఆమె మృతికి సంతాపంగా వీరు ఈ డెసిషన్‌ తీసుకున్నారు. అలాగే వర్మ అయితే శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వర్మ ఏ విషయంలోనూ ఇంతగా బాధపడిన సందర్భాలు లేవు. కానీ శ్రీదేవి మరణాన్ని మాత్రం ఆయన తట్టుకోలేకపోతున్నారు. 

ఇకపోతే నాగ్‌ – వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘ఆఫీసర్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకి ‘గన్‌’, ‘శపథం’ తదితర టైటిల్స్‌ను పరిశీలించారు. కానీ కథానుగుణంగా ‘ఆఫీసర్‌’ అనే టైటిల్‌ ఈ సినిమాకి ఏప్ట్‌ అని భావిస్తున్నారట. త్వరలోనే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌నీ విడుదల చేయనున్నారు. ఓ పాపను కాపాడే క్రమంలో హీరోగా నాగార్జున చేసే సాహసాలే ఈ సినిమా కథ. ఆ సాహసాలను అత్యంత పవర్‌పుల్‌ యాక్షన్‌ ఘట్టాలుగా వర్మ తెరకెక్కించనున్నారు. 

ముంబయ్‌లో ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసి, వీలైనంత త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular