HomeMovie News Teluguఎస్‌ఎస్‌ఎంబీ-24: వాట్‌ ఏ స్టామినా!

ఎస్‌ఎస్‌ఎంబీ-24: వాట్‌ ఏ స్టామినా!

‘స్పైడర్‌’ సినిమా నిరాశపర్చింది. అంతకు ముందు ‘బ్రహ్మూెత్సవం’ సినిమా టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. రెండు వరుస వైఫల్యాల తర్వాత టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ నుంచి వస్తోన్న సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ-24’. ఇంకా ఈ సినిమాకి టైటిల్‌ ఖరారు చేయలేదు. ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ మాత్రం ప్రచారంలో ఉంది. టైటిల్‌పై క్లారిటీ ఈ నెల 26న రాబోతోంది. 

అదే రోజున ‘ఫస్ట్‌ ఓత్‌’ అంటూ సినిమా ఫస్ట్‌ లుక్‌ గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రీ లుక్స్‌ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దారు. గత సినిమాల ఫలితాలెలా ఉన్నా సరే, కొత్త సినిమాతో అంచనాల్ని ఆకాశాన్నంటేయడమే స్టార్‌డమ్‌. ఆ స్టార్‌డమ్‌ విషయంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అదే ఈ సినిమాపై పెరిగిపోయిన అంచనాలకు నిదర్శనం. మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ తొలిసారిగా తెలుగులో ఈ సినిమా చేస్తోంది. మహేష్‌తో ‘శ్రీమంతుడు’ సినిమా తెరకెక్కించి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన కొరటాల శివ ఈ ‘ఎస్‌ఎస్‌ఎంబీ-24’ చిత్రానికి దర్శకుడు. 

కొరటాల శివ అంటే సోషల్‌ మెసేజ్‌ని కమర్షియల్‌ ఫార్మాట్‌లో చెప్పగల సత్తా ఉన్న దర్శకుడని అందరికీ తెల్సిందే. ఈ సినిమా కోసం కొరటాల శివ, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ని ఎన్నుకోవడంతో మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలపై పవర్‌ఫుల్‌ వ్యంగ్యాస్త్రమే అవుతుందో, వ్యంగ్యాస్త్రంలా కాకుండా ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తించే పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ ఎంటర్‌టైనరే అవుతుందోగానీ ఇటు సినీ పరిశ్రమతోపాటు, అటు రాజకీయ వర్గాలూ ఇప్పుడు ‘ఎస్‌ఎస్‌ఎంబీ-24’ పట్ల ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 

26న విడుదల కానున్న ఫస్ట్‌ ఓత్‌ అదేనండీ ఫస్ట్‌ లుక్‌ ఎలా ఉంటుందో, బాక్సాఫీస్‌పై సూపర్‌ స్టార్‌ ఈసారి ఎలాంటి ఇంపాక్ట్‌ చూపుతాడో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular