HomeMovie News Teluguపవన్‌ - చరణ్‌ కాంబో పట్టాలెక్కుతోందా?

పవన్‌ – చరణ్‌ కాంబో పట్టాలెక్కుతోందా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందాల్సి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో ఈ కాంబినేషన్‌ రూపొందనుందని గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ కాంబినేషన్‌లో సినిమాకి కథ సిద్ధమైందనీ సమాచారమ్‌. త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్‌ని ప్రకటించనున్నారట. 

చరణ్‌కీ, పవన్‌ కళ్యాణ్‌కీ అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడనీ సమాచారమ్‌. అయితే ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఎవరనేది సస్పెన్సే. ఆల్రెడీ పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో’సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం యంగ్‌ హీరో నితిన్‌ హీరోగా పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇదిలా ఉండగా, తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ ఆశక్తి కలిగిస్తోంది. 

అయితే మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్యనే ‘అజ్ఞాతవాసి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ బిజీ కారణంగా హీరోగా ప్రస్తుతానికి సినిమాలు చేయకపోయినా, నిర్మాతగా ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉంటారట పవన్‌ కళ్యాణ్‌. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూ పవన్‌ కళ్యాణ్‌ సినీ నిర్మాణ బాధ్యతల్ని ఎలా డీల్‌ చేస్తారో ఏమో కానీ, బాబాయ్‌ బ్యానర్‌ అంటే చరణ్‌కి సొంత బ్యానర్‌ లెక్కే. 

తన సొంత నిర్మాణంలో ఇప్పటికే చరణ్‌ తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నెం150’ సినిమాని రూపొందించి సక్సెస్‌ అయ్యాడు. ప్రస్తుతం నిర్మాతగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అలాగే బాబాయ్‌ బ్యానర్‌లో నటిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ నిర్మాణ బాధ్యతలు కూడా షేర్‌ చేసుకుంటాడేమో చరణ్‌ చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular