HomeMovie News Telugu'జై సింహా' - బాలయ్య మాస్‌ గర్జన

‘జై సింహా’ – బాలయ్య మాస్‌ గర్జన

మామూలుగానే ఈ మధ్య నందమూరి బాలకృష్ణలో ఎనర్జీ లెవల్స్‌ చాలా ఎక్కువగా కన్పిస్తున్నాయి. వయసు పెరుగుతోంటే, తగ్గాల్సిన ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతుండటమంటే అది ఆయన కమిట్‌మెంట్‌ వల్లనే సాధ్యమయ్యిందేమో. తన కొత్త మూవీ ‘జై సింహా’ సినిమాలోనూ బాలకృష్ణ కంప్లీట్‌ ఎనర్జీతో కన్పించారు. ట్రైలర్‌ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ ఎనర్జీ అదుర్స్‌ అనేలా కనిపించిందనడం అతిశయోక్తి కాదు. బాలయ్య చెప్పిన మాస్‌ డైలాగ్స్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించేస్తున్నాయి. 

నిన్న జరిగిన ‘జై సింహా’ ఆడియో పంక్షన్‌లోనూ బాలకృష్ణ ఫుల్‌ ఎనర్జీతో కనిపించారు. సినిమా, రాజకీయాలు సమా చాలా అంశాలపై గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసిన బాలకృష్ణ, తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్‌ – అక్కినేని రెండు కళ్ళని చెప్పారు. ఆ ఇద్దరి నుంచీ తాను చాలా నేర్చుకున్నానని చెప్పిన బాలకృష్ణ, ‘జై సింహా’ సినిమా కోసం యాక్షన్‌ సీన్స్‌ తీస్తుండగా తనకు గాయాలైనా లెక్కచేయలేదని అన్నారు. తన ప్రతి సినిమాలోనూ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తోపాటు, మంచి మెసేజ్‌ కూడా ఉంటుందని చెబుతూ, ‘జై సింహ’ కూడా ఓ మంచి మెసేజ్‌ ఇచ్చే మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని అన్నారు. 

మేనల్లుడు నారా లోకేష్‌ని ముఖ్య అతిథిగా బాలయ్య ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి తీసుకువచ్చారు. నారా లోకేష్‌ నాయకుడిగా ఎదిగారనీ, మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవలందిస్తున్నారనీ, ఆయన విజన్‌ అద్భుతమనీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు ఒకటేననీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగు సినిమా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు బాలకృష్ణ. సినీ నటుడిగానే కాక, ఎమ్మెల్యేగానూ బాలకృష్ణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనీ, నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం బాలకృష్ణ, తన వెంట పడ్తున్నారని నారా లోకేష్‌ చెబుతూ, బాలయ్యను ‘మా ముద్దుల మావయ్య’ అని చెప్పడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular