HomeMovie News Teluguమోహన్‌బాబు కళ్లలో మ్యాజిక్‌ చూస్తారా?

మోహన్‌బాబు కళ్లలో మ్యాజిక్‌ చూస్తారా?

నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలతో మెప్పించిన మోహన్‌బాబు, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపునీ సంపాదించుకున్నారు. 

కెరీర్‌ మొదట్లో విలన్‌గా కన్పించినా, ఆ తర్వాత హీరోగా మారి, ఎన్నో కమర్షియల్‌ హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు మంచు మోహన్‌బాబు. ఆయన్నుంచి ‘పెదరాయుడు’ వంటి సెన్సేషనల్‌ హిట్స్‌ వచ్చాయి. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాయి. కొత్త ఇన్నింగ్స్‌లో కొత్త తరహా పాత్రల్ని ఎంచుకుంటున్న మోహన్‌బాబు, ‘రౌడీ’ తదితర సినిమాల్లో నటించారు. త్వరలో ‘గాయత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మోహన్‌బాబు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ క్రిస్‌మస్‌ కానుకగా విడుదలైంది. 

వస్తూనే ‘గాయత్రి’ ఫస్ట్‌లుక్‌ టాక్‌ ఆప్‌ ది టాలీవుడ్‌ అయ్యింది. ఫస్ట్‌లుక్‌లో మోహన్‌బాబు గెటప్‌. మెలి తిప్పిన మీసం, షార్ప్‌ లుక్స్‌తో మోహన్‌బాబు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. దాంతోపాటుగా ‘ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే’ అనే క్యాప్షన్‌ సినిమాపై ఇంట్రెస్ట్‌ని మరింత పెంచుతోంది. మదన్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మోహన్‌బాబు మనవరాళ్ళు అరియానా, వివియానా విద్యా నిర్వాణ సమర్పిస్తుండడం ఇంకో విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 

ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచు విష్ణు, శ్రియ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై ‘గాయత్రి’ సినిమా తెరకెక్కబోతోంది. ఫస్ట్‌ లుక్‌తోనే సినిమాపై అమాంతం అంచనాల్ని పెంచేసిన నేపథ్యంలో, సినిమా టీజర్‌, ట్రైలర్‌ సినిమా విడుదలకు ముందే ఇంకెలాంటి సంచలనాలకు తెరలేపనున్నాయో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular