HomeMovie News Teluguటెన్షన్‌ పెంచేస్తోన్న 'జై లవ కుశ'

టెన్షన్‌ పెంచేస్తోన్న ‘జై లవ కుశ’

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై లవకుశ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రేపు విడుదల చేయనున్నారు. ఎల్లుండి అనగా మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నాడు తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌తో. రేపు మధ్యాహ్నం 3 గంటల 15 నిముషాలకు ఈ లుక్‌ని విడుదల చేయనున్నారనీ చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది. దాంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మొదలయ్యింది. ఎన్టీఆర్‌ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

అయితే రేపు విడుద కాబోయే ఫస్ట్‌ లుక్‌ ఎలా ఉండబోతోంది. మూడు పాత్రలకి సంబంధించిన లుక్‌ని విడుదల చేస్తారా? లేక ఏదో ఒక పాత్రకి సంబంధించిన లుక్‌ని మాత్రమే విడుదల చేస్తారా? ఈ రెండూ కాక శ్రీరామనవమి సందర్భంగా వచ్చినట్లుగా మోషన్‌ పోస్టర్‌ ఏదైనా ఉండబోతోందా అంటూ పలు రకాల ప్రశ్నలతో అభిమానులు క్యూరియాసిటీని తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకి సంబంధించిన మూడు గెటప్స్‌ ఒకే ఫోటోలో కలిపి ఉన్నట్లుగా ఉండే లుక్‌ బయటికి రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.

అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలీదు. ఒకవేళ ఇదే జరిగితే ఫ్యాన్స్‌ నిజంగా పండగ చేసేసుకుంటారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో తొలిసారిగా రూపొందుతోన్న ఎన్టీఆర్‌ చిత్రమిది. ఎన్టీఆర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular