HomeMovie News Teluguచరణ్‌ సినిమాలో ప్రకాష్‌రాజ్‌

చరణ్‌ సినిమాలో ప్రకాష్‌రాజ్‌

చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘రేపల్లె’ టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో చరణ్‌ ఓ డిఫరెంట్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం సుకుమార్‌, ప్రకాష్‌ రాజ్‌ని ఎంచుకున్నారట. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకం అంటున్నారు. ప్రకాష్‌ రాజ్‌ నటిస్తుండడం వింతేమీ కాకపోయినా, పాత్ర పరంగా సుకుమార్‌ ఈ క్యారెక్టర్‌ని చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేశాడట.

ఈ క్యారెక్టర్‌ ఏంటనేది మాత్రం తెరపైనే చూడాలి. ఈ పాత్ర విషయంలో చాలా సస్పెన్స్‌ పాటిస్తున్నారు. మామూలుగానే ఏ పాత్ర చేసినా ప్రకాష్‌రాజ్‌ అంటేనే చాలా చాలా స్పెషల్‌. అందులోనూ ఇంత ప్రత్యేకించి చెబుతున్నారంటే ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందో అనుకుంటున్నారంతా. అసలే సుకుమార్‌ సినిమాలో క్యారెక్టర్స్‌ అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. ప్రతీ చిన్న పాత్ర కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

అలాంటిది సుకుమార్‌ ఇంతగా దృష్టి పెట్టి డిజైన్‌ చేశాడంటే ప్రకాష్‌రాజ్‌ ఈసారి ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నాడో ఈ సినిమాలో. గతంలో చరణ్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించాడు ప్రకాష్‌రాజ్‌. కెరీర్‌లో ఇంతవరకూ నటించని అత్యంత స్పెషల్‌ క్యారెక్టర్‌లో ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ని చూడబోతున్నామట. అదేంటో తెలియాలంటే సినిమా విడుదలైతే కానీ తెలీదు. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular