HomeMovie News Teluguసోనూ సూద్‌ నిర్మాతగా సింధు బయోపిక్‌

సోనూ సూద్‌ నిర్మాతగా సింధు బయోపిక్‌

బ్యాడ్మింటన్‌ సంచలనం పి.వి.సింధు బయోపిక్‌ తెరకెక్కించబోతున్నారు. బ్యాడ్మింటన్‌ కోర్టులో హోరా హోరీగా ఆడి దేశానికి సిల్వర్‌ పతకం సాధించి పెట్టింది పి.వి.సింధు. అందుకే ఆమె పడిన కష్టానికి దృశ్య రూపం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. గత ఏడెనిమిది నెలలుగా ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన సోనూ సూద్‌ హిందీలో ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన ‘తూతకు తూతకు తూతియా’ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ సినిమా తెలుగులో ‘అభినేత్రి’ పేరుతో విడుదలైంది. ఈ సారి చేయబోయే సినిమా బయోపిక్‌ అయితే బాగుంటుందని భావించాడట సోనూ సూద్‌. ఈ సినిమాలో సింధు పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బయోపిక్స్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది.

మరో బ్యాడ్మింటన్‌ సంచలనం గోపీచంద్‌ బయోపిక్‌ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా కాలంగా. ఈ సినిమాలో సుధీర్‌ బాబు నటించనున్నాడన్న ప్రచారం బాగా విన్పిస్తోంది. అలాగే సైనా నెహ్వాల్‌ జీవిత చరిత్ర కూడా బాలీవుడ్‌లోనే తెరకెక్కుతోంది. ‘సైనా’ టైటిల్‌తో శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్పోర్ట్స్‌ నేపధ్యంలో తెరకెక్కిన ‘మేరీకోమ్‌’ సినిమా ఘన విజయం సాధించింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బయోపిక్‌ కావడం విశేషం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular