HomeMovie News Teluguరాజమౌళికి 'దేవుడి' ప్రశంసలు

రాజమౌళికి ‘దేవుడి’ ప్రశంసలు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అంటే అభిమానులకు దేవుడే. ఆ దేవుడి ప్రశంసలే దక్కించుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ‘బాహుబలి ది కంక్లూజన్‌’ చిత్రాన్ని అభినందిస్తూ ‘తలైవా’ రజనీకాంత్‌, సోషల్‌ మీడియాలో చేసిన పోస్టింగ్‌ సంచలనంగా మారింది. రాజమౌళిని దేవుడి పుత్రుడిగా రజనీకాంత్‌ పేర్కొనడమే దానికి కారణం. ఇప్పటికే దేశ దేశాల ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంటున్న రాజమౌళి, తాజాగా సూపర్‌ స్టార్‌ ప్రశంసలతో ఉప్పొంగిపోతున్నాడు.

ఆయన ప్రశంసలకు దేవుడే తనను ఆశీర్వదించినట్లుగా వుందని సోషల్‌ మీడియాలో స్పందించాడు రాజమౌళి. ఇంతకు మించిన ప్రశంస ఇంకేముంటుంది? సినిమాలో ఉన్న గొప్పతనం అలాంటిది. మరోపక్క మెగాస్టార్‌ చిరంజీవి కూడా రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తేశారు. అలాగే బాలీవుడ్‌ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది రాజమౌళికి. ఓ తెలుగు సినిమాకి ఇంతలా గౌరవం దక్కుతుందంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఫలితం ఉంది.

అలాంటి అపురూపమైన కృషికి ప్రాణం పోసింది రాజమౌళినే అని చెప్పక తప్పదు. ప్రతీ దర్శకుడు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తాడు. అయితే ఆ ఉన్నతమైన ఆలోచనకి దృశ్య రూపాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించాడనేదే గొప్ప విషయం. అలాంటి అరుదైన ఆవిష్కరణ చేసి చూపించాడు మన తెలుగోడు మనోడు ది గ్రేట్‌ రాజమౌళి. అందుకే ఆయన ముందు ఎంతటి ప్రశంసలైనా చిన్నబోక తప్పదు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular