HomeMovie News Teluguమెగా మూవీపై కర్చీఫ్‌ వేసిన రోజా

మెగా మూవీపై కర్చీఫ్‌ వేసిన రోజా

హీరోయిన్‌గా పలు సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల్లో నటించిన రోజా, ప్రస్తుతం రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరో పక్క టీవీ షోస్‌లో కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మెగా షోకి గెస్ట్‌గా విచ్చేశారు. ఎంతో యాక్టివ్‌గా గేమ్‌లో పాల్గొన్నారు. ఈ గేమ్‌లో గెలుచుకున్న డబ్బును ఏం చేస్తారని చిరంజీవి అడగ్గా, తన నియోజక వర్గం నగరి అభివృద్ది కార్యక్రమాలకు వినియోగిస్తానని ఆమె తెలిపారు.

మరో పక్క చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు రోజా. అప్పట్లో ఈ ఇద్దరు కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి. అలాగే రీ ఎంట్రీలో కూడా మళ్లీ అవకాశం వస్తే ఆయన సినిమాలో నటించే ఛాన్స్‌ రావాలని రోజా కోరుకున్నారు. ‘బిగ్‌ బాస్‌’, ముగ్గురు మొనగాళ్లు’, ముఠామేస్త్రి’ తదితర చిత్రాలు మాస్‌ యాక్షన్‌ మూవీస్‌గా పాపులర్‌ అయ్యాయి. ఈ షోలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లోని పాటలకు ఫుల్‌ జోష్‌తో ఇద్దరూ స్టెప్పులేశారు.

ప్రస్తుతం రోజా సినిమాల్లో నటించడం లేదు కానీ, బుల్లితెర షోల్లో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవి కోసం మళ్లీ సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. రోజా కోరింది కదా.. రోజాకి చిరంజీవి తన సినిమాల్లో అవకాశమిస్తారో లేదో చూడాలిక. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular