HomeMovie News Teluguతెలుగు మీడియా అంటే లెక్క‌లేదా??

తెలుగు మీడియా అంటే లెక్క‌లేదా??

బాహుబ‌లిని నెత్తిన పెట్టుకొని మోస్తోంది మీడియా. అందులోనూ తెలుగు మీడియా అయితే మ‌రీనూ. ఒక్క స్టిల్ వ‌స్తే మ‌హా ప్ర‌సాదం అంటూ.. స్వీక‌రిస్తోంది, దాన్ని ఓ స్థాయిలో ప్ర‌మోట్ చేస్తోంది. అయినా స‌రే, తెలుగు మీడియా అంటే బాహుబ‌లి అండ్ టీమ్‌కి చిన్న‌చూపు అనే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈరోజు ముంబైలో ప్రీమియ‌ర్ షో ఉంది. అక్క‌డి మీడియాని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి అన్న‌ట్టు ప్ర‌త్యేకంగా ఇన్విటేష‌న్లు ముద్రించి మ‌రీ ఆహ్వానించారు.

కానీ తెలుగులో మాత్రం ఆ ప‌రిస్థితి లేదు. గురువారం రాత్రి నుంచే బాహుబ‌లి 2 షోలు మొద‌లైపోతున్నాయి. మ‌రి మీడియా వాళ్ల‌కు షో వేస్తారా, లేదా?  అనేది మాత్రం ఇంకా స్ప‌ష్టంగా తెలీలేదు. ముందు అనుకొన్న ప్ర‌కార‌మైతే శుక్ర‌వారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో మీడియాకు షో ఉంది. ముంబైలో ఒక రోజు ముందే మీడియాకు షో వేసిన బాహుబ‌లి టీమ్‌.. తెలుగు మీడియా విష‌యంలో మాత్రం ఆ మ‌ర్యాద పాటించ‌డం లేదు.

ఈ విష‌యంలో బాహుబ‌లి టీమ్ ముందే కొంత‌మంది మీడియా ప్ర‌తినిధులు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. దాంతో… చిత్ర‌బృందం దిగివ‌చ్చింద‌ని అందుకే  ఈరోజు రాత్రి 9,30ల‌కు మీడియాకు ప్ర‌త్యేకంగా షో వేయ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular