మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో రవితేజ తదుపరి చిత్రం ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన భద్ర, రాజా ది గ్రేట్ చిత్రాలను నిర్మించిన దిల్ రాజుతో మరోసారి ఆయన చేతులు కలిపినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హాసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథను రవితేజ, దిల్ రాజుకు వినిపించగా ఇద్దరికీ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకు ‘అక్కాయిలు బాగున్నారా!’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొంతమంది అభిమానులు టైటిల్ మాస్‌గా ఉందని చెబుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మొత్తానికి రవితేజ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్‌గా మారింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.





