మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ కోసం మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంయుక్త, ఈ ఒక్క పాట కోసం భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమెకు దాదాపు రూ.3 కోట్లు అందిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.
బుధవారం నుంచి వనస్థలిపురంలో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. రామ్ చరణ్ మాస్ డాన్స్‌కు, సంయుక్త గ్లామర్ జత కలిస్తే ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి పెద్దిలో స్పెషల్ సాంగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.





