కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్ ఇటీవల లీక్ వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. హెచ్. వినోత్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది.
మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికీ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ కావడం పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటనపై సినీ పరిశ్రమ మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఒక సినిమా అంటే నమ్మకం, కష్టం, ఎంతోమంది కలల సమాహారం. ఇలాంటి లీక్ ఘటనలు కేవలం ఒక సినిమానే కాదు, మొత్తం పరిశ్రమను ప్రభావితం చేస్తాయి’ అని పేర్కొన్నారు.
అలాగే, సృజనాత్మక కృషిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసిందని అన్నారు. జననాయగన్ చిత్రానికి జరిగిన నష్టాన్ని తగ్గించడానికి కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పైరసీని పూర్తిగా నిర్మూలించాలనే పిలుపునిచ్చారు.
చివరగా.. ‘పైరసీని చంపండి… సినిమాను కాపాడండి’ అంటూ చిరంజీవి తన సందేశాన్ని ముగించారు.
మొత్తానికి.. జననాయగన్ లీక్ వివాదం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి పైరసీపై పెద్ద చర్చకు దారితీసింది.
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
Cinema is built on trust, effort, and the collective dreams of many.
Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.
We stand one with KVN…





