గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పూర్తిగా ‘పెద్ది’ సినిమాపైనే దృష్టి పెట్టారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఆయన చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ లుక్, పాత్ర కొత్తగా ఉండబోతుందని ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ కూడా ట్రెండ్ అవుతూ, సినిమా అంచనాలు మరింత పెంచింది.
ఇంతలో గత కొన్ని రోజులుగా ‘పెద్ది’ రిలీజ్ వాయిదా పడుతుంది అనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ ఆలస్యమవుతుందని, మార్చి 27 రిలీజ్ అసాధ్యం అవుతుందని ప్రచారం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్‌లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ వార్తలు పూర్తిగా పుకార్లే.
సినిమా మేకర్స్ స్పష్టంగా చెప్పింది ఏమిటంటే.. ‘పెద్ది’ రిలీజ్ డేట్ మార్చడం లేదు. ముందుగా ప్రకటించినట్టుగానే సినిమా మార్చి 27, 2026న థియేటర్లలోకి వస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. రేపటి నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం, తర్వాత ఢిల్లీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. జనవరి చివరి నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేయడమే లక్ష్యం. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరగుతున్నాయి. కాబట్టి సినిమా లేట్ అయ్యే అవకాశమే లేదని టీమ్ కన్ఫర్మ్ చేసింది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటుల పాత్రలు కూడా సినిమాపై హైప్‌ను పెంచుతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ చిత్రానికి పెద్ద అడ్వాంటేజ్.
మొత్తానికి.. ‘పెద్ది’ రిలీజ్ వాయిదా పడ్డట్టు వచ్చిన వార్తలు అన్నీ గాసిప్స్ మాత్రమే. చరణ్ బర్త్‌డే గిఫ్ట్‌గా మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.





