HomeMovie News Teluguఅఖండ -2 కి బోయపాటి డబుల్ పేమెంట్ !?

అఖండ -2 కి బోయపాటి డబుల్ పేమెంట్ !?

బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోపై ఇండస్ట్రీలో మంచి హైపు ఉంది. ఫాన్స్ అయితే ఈ క్రేజీ కాంబో కోసం తెగ వెయిట్ చేస్తుంటారు . ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు ఒక దాన్ని మించి ఒకటి హిట్ అందుకున్నాయి. ప్రజంట్ బాలయ్య బోయపాటి అఖండ 2 తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. సింహా, లెజెండ్, అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన వీరిద్దరూ అఖండ 2 తో పాన్ ఇండియా హిట్ కోసం లైన్ లో ఉన్నారు. అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

అఘోర పాత్రలో బాలయ్య ఫాన్స్ ని మెస్మరైజ్ చేసారు. మళ్ళీ బాలయ్యని అఘోరాగా చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన అఖండ 2 ట్రైలర్ కి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ట్రైలర్ ఇచ్చిన కిక్ తో ఫాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ లవర్స్ కూడా అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ కానుంది. సినిమా హైపు తో పాటు బోయపాటి రెమ్యునరేషన్ కూడా అంతే హైపులో ఉందని టాక్. అఖండ 2 కోసం బోయపాటి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్కంద సినిమాకు 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న బోయపాటి అఖండ 2 కోసం డబుల్ రెమ్యునరేషన్ అంటే 36 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్కంద డిజాస్టర్ కావటంతో బోయపాటి పేమెంట్ తగ్గుతుంది అని అంతా అనుకున్నారు. కానీ బోయపాటి , బాలయ్య కాంబో కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ బోయపాటికి డబుల్ పేమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనరల్ గా ఒక డిజాస్టర్ తరువాత రెమ్యునరేషన్ తగ్గటం కామన్ కానీ పెరగటం చాలా రేర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular