టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) అభిమానులు ఆశించే రీతిలోనే ఈ ట్రైలర్ రూపొందించబడింది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తన ప్రత్యేక శైలిలో నటించి, తెరపై మరోసారి మాస్ ఎనర్జీని పంచారు.
రవితేజ అంటేనే స్క్రీన్‌పై ఉత్సాహం, పంచ్‌లు, యాక్షన్ అన్నీ మేళవించి ఒక సెలబ్రేషన్ లా ఉంటుంది. అదే ఉత్సాహం ఈ ట్రైలర్‌లో కూడా ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. పవర్‌ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలు, రవితేజ స్టైల్ పంచ్‌లు అన్నీ అభిమానులకు పక్కా మాస్ ట్రీట్ లా మారాయి.
Welcoming you all to our #MassJathara 🔥
— Ravi Teja (@RaviTeja_offl) October 27, 2025
Here’s #MassJatharaTrailer https://t.co/CNZ889B4lw
See you all in theatres from October 31st with premieres 🤗 pic.twitter.com/vdXc7hWoH0
ఇక కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య జరిగే ఉత్కంఠభరితమైన సంఘర్షణను చూపించిన తీరు ట్రైలర్ హైలైట్‌గా నిలిచింది. నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) శక్తివంతమైన విలన్‌గా రవితేజకు సరైన ప్రతిస్పందన ఇచ్చారు.
మరింత గ్లామర్ అండ్ ఎమోషన్ కలిపిన పాత్రలో శ్రీలీల (Sreeleela) కనిపించారు. ముఖ్యంగా ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రవితేజ–శ్రీలీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.



