HomeMovie News Teluguనెలరోజుల్లోనే ఓటీటీలోకి ‘మిరాయ్’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?

నెలరోజుల్లోనే ఓటీటీలోకి ‘మిరాయ్’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా, విడుదలైన నాటి నుంచి రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తూ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.

ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దీంతో సినీ ప్రియులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా అధికారిక ప్రకటన విడుదలైంది. కేవలం నెలరోజులకే ‘మిరాయ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా, అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు.

“తొమ్మిది గ్రంథాలు.. అనంతమైన శక్తి.. బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఒక సూపర్ యోధుడు. భారతదేశం సొంత సూపర్ హీరో ‘మిరాయ్’, అక్టోబర్ 10 నుండి మీ ఇంటికి రాబోతున్నారు” అంటూ ప్రత్యేక క్యాప్షన్‌ను షేర్ చేశారు.

ఈ అప్డేట్ తెలుసుకున్న ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్ విలన్‌గా, అలాగే జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular