HomeMovie News Teluguసూపర్‌స్టార్‌తో రౌడీస్టార్‌ అసలు కథేంటంటే!

సూపర్‌స్టార్‌తో రౌడీస్టార్‌ అసలు కథేంటంటే!

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నిర్మాణంలో మహేష్‌ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్‌బాబు స్టార్ట్‌ చేసిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతుంది. కాగా ఇదే బ్యానర్‌లో పలువురు యంగ్‌ హీరోలతోనూ సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాడు మహేష్‌బాబు. ఈ నిర్మాణ బాధ్యతలు ఆయన భార్య నమ్రత పర్యవేక్షణలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారమ్‌ ప్రకారం ఇదే బ్యానర్‌లో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా మహేష్‌తో కలిసి చేసుకున్నాడు మన రౌడీ. అలా ఈ మధ్య మహేష్‌తో తెగ రాసుకు పూసుకు తిరుగుతున్నాడు మనోడు. అయితే అందుకు కారణం ఇదీ అని లేట్‌గా విషయం బయటికి వచ్చింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నాడట. అయితే, ప్రస్తుతానికి ఆ సినిమా వివరాలేం తెలియవు కానీ, ఆల్రెడీ ఇదే బ్యానర్‌లో మరో యంగ్‌ హీరో అడవిశేష్‌ ‘మేజర్‌’ సినిమా కన్‌ఫామ్‌ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ‘ఎవరు’ సినిమాతో బిజీగా ఉన్న అడవిశేష్‌ కొద్ది రోజుల్లోనే ‘మేజర్‌’పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేయనున్నారు. ఇది పూర్తి కాగానే విజయ్‌తో సినిమా పట్టాలెక్కనుంది కాబోలు. మరోవైపు విజయ్‌ దేవరకొండ మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే బ్యానర్‌లో మరో సినిమాకీ విజయ్‌కి కమిట్మెంట్‌ ఉంది. అయితే, సూపర్‌స్టార్‌ సినిమాని పట్టాలెక్కిస్తాడో, లేక, మైత్రీ వాళ్లతోనే కంటిన్యూ చేస్తాడో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular