HomeMovie News Teluguపెళ్లి ముడితో ఒక్కటైన ప్రేమజంట.!

పెళ్లి ముడితో ఒక్కటైన ప్రేమజంట.!

అఖిల్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌, తమిళ హీరో ఆర్యతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజున వీరిద్దరి ప్రేమను కన్‌ఫామ్‌ చేస్తూ పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారీ జంట. తాజాగా హైద్రాబాద్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. తెలుగులో ‘అఖిల్‌’ సినిమా పరాజయంతో మరో సినిమా అవకాశం రాలేదీ బ్యూటీకి. 

దాంతో కోలీవుడ్‌ని ఆశ్రయించింది. కోలీవుడ్‌లో సాయేషా బాగానే ఛాన్సులు దక్కించుకుంది. ‘గజనీకాంత్‌’ సినిమా టైంలో ఆర్య, సాయేషా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో ఆ ప్రేమ పెరిగి పెద్దదై పెళ్లి ముడితో ఒక్కటయ్యారీ ప్రేమ పక్షులు. పెళ్లికి హైద్రాబాద్‌ని వేదికగా చేసుకున్న ఈ ప్రేమ జంట, త్వరలో చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం ఆర్య, సాయేషా కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. 

అయితే పెళ్లి తర్వాత సాయేషా సైగల్‌ ఇక సినిమాల్లో నటించదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ పెళ్లి తర్వాత కూడా తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా, ముద్దుగుమ్మలు కెరీర్‌ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్నారు. కానీ సాయేషా మాత్రం పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమాల్ని మాత్రమే కంప్లీట్‌ చేయనుందట. ఇక కొత్త ప్రాజెక్ట్‌లేమీ ఒప్పుకోదనీ కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు నిజమో కాదో, చూడాలి మరి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular