HomePolitics Teluguజగన్‌ పార్టీలో చేరిన సహజనటి.!

జగన్‌ పార్టీలో చేరిన సహజనటి.!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల వైపు చూస్తున్నారు. ప్రధానంగా సినిమా వాళ్లంతా జగన్‌ వెంట పడుతున్నారు. వరుసపెట్టి జగన్‌ పార్టీలోకి చేరుతున్నారు పలువురు సినీ నటులు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, పృధ్వీ, కమెడియన్‌ కృష్ణుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ మామగారైన నార్నే శ్రీనివాసరావు తదితరులు ఆల్రెడీ జగన్‌ వెంట నడుస్తున్నారు. ఈ కోవలో తాజాగా సహజనటి జయసుధ కూడా చేరారు. 

వైఎస్సార్‌సీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు గతంలో రాజశేఖర్‌ రెడ్డి టైంలో కాంగ్రెస్‌ పార్టీ నేతగా ఉన్న జయసుధ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం టీడీపీ కండువా వేసుకున్నారు. తాజాగా మళ్లీ జయసుధ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. నటిగా సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలతోనూ ప్రజలకు సేవలందిస్తున్న జయసుధ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

ఇదిలా ఉంటే గతంలో ‘మా’ ఎలక్షన్స్‌లో కూడా జయసుధ, నటుడు రాజేంద్రప్రసాద్‌కి గట్టి పోటీ ఇచ్చారు. చిట్టచివరికి రాజేంద్రప్రసాద్‌పై ఓటమిని చవి చూశారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular