HomeMovie News Teluguపెళ్లి ముచ్చట 'కొత్త బంగారులోకం'లోకి.!

పెళ్లి ముచ్చట ‘కొత్త బంగారులోకం’లోకి.!

‘ఏ..కా..డా..’ అంటూ ముద్దు ముద్దుగా ‘కొత్త బంగారు లోకం’ సినిమా తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి మెస్మరైజ్‌ చేసిన బెంగాళీ బొద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్‌ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఫిలిం మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ని పెళ్లాడింది. తన పెళ్లి కబుర్లను శ్వేతాబసు ప్రసాద్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ‘కొత్త బంగారు లోకం’తో పాటు ‘కాస్కో’, రైడ్‌, కళావర్‌ కింగ్‌’ తదితర సినిమాల్లోనూ శ్వేతా అలరించింది. కేవలం నటి మాత్రమే కాదు, శ్వేతకి సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలపై పూర్తి పట్టుంది.

దర్శకత్వ విభాగంలోనూ రచనా విభాగంలోనూ అనుభవం సంపాదించింది. బుల్లితెరపైనా కనువిందు చేసింది. ఆ మధ్య తెలుగు నాట ఓ వివాదంలో ఇరుక్కుంది శ్వేతాబసు ప్రసాద్‌. ఆ వివాదం కారణంగా సినిమాలకు దూరమైంది. తర్వాత ఆ వివాదాల నుండి కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేశాక, తిరిగి సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. అంతేకాదు, త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ పెళ్లి రెండు సార్లు జరిగింది. బెంగాళీ సాంప్రదాయంలో ఓసారి, మరాఠీ సాంప్రదాయంలో ఇంకోసారి పెళ్లి చేసుకుంది శ్వేతాబసు ప్రసాద్‌. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular