HomeMovie News Teluguఅంజ‌న‌మ్మ‌... ఆత్మీయ విరాళం

అంజ‌న‌మ్మ‌… ఆత్మీయ విరాళం

ప్ర‌శ్నించ‌డానికి, మార్పు తీసుకురావ‌డానికి ఉద్భ‌వించిన పార్టీ… జ‌న‌సేన‌.  2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌తో.. జ‌న‌సేన ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగ‌బోతోంది. ఏ పార్టీకైనా… ఆర్థిక అండ‌దండ‌లు అవ‌స‌రం. అవ‌న్నీ విరాళాల రూపంలో సేక‌రిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన‌కు కూడా అలా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన విరాళాలు ఒక ఎత్తు.. ఇప్పుడు వ‌చ్చిన విరాళం ఒక ఎత్తు. ఎందుకంటే ఈసారి విరాళం ఇచ్చింది ఎవ‌రో కాదు… ప‌వ‌న్ క‌ల్యాణ్ మాతృమూర్తి అంజ‌నా దేవి. మంగ‌ళవారం జ‌న‌సేన పార్టీ ఆఫీసుకు అనుకోని అతిథి రూపంలో అంజ‌నాదేవి వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీకి త‌న‌వంతు విరాళంగా రూ.4 ల‌క్ష‌లు అంద‌జేశారు. 

పార్టీ ఆఫీసులో అమ్మ‌తో కాసేపు కులాసాగా గ‌డిపారు ప‌వన్‌. చివ‌ర‌కు ఆమెను కారు వ‌ర‌కూ తీసుకెళ్లి… సాగ‌నంపారు. వాటికి సంబంధించిన ఫొటోల్ని జ‌న‌సేన పార్టీ కొద్దిసేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసింది. గ‌త కొంత‌కాలంగా గ‌డ్డంతో క‌నిపించిన ప‌వ‌న్‌… ఈసారి లుక్ మార్చారు. 

ఆయ‌న క్లీన్ షేవ్‌తో క‌నిపించేస‌రికి.. ఒక‌ప్ప‌టి ప‌వ‌ర్ స్టార్‌ని మ‌ళ్లీ చూస్తున్న అనుభూతికి లోన‌వుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular