HomeMovie News Teluguబుల్లితెరపైకి తారక్‌ మళ్లీ వస్తున్నాడహో.!

బుల్లితెరపైకి తారక్‌ మళ్లీ వస్తున్నాడహో.!

బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షోతో ఎన్టీఆర్‌ ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో చిలిపి చేష్టలతో బిగ్‌బాస్‌ షోని ఆకట్టుకునేలా చేశాడు. అప్పటి వరకూ ఉన్న టీఆర్‌పీ రేటింగ్స్‌నన్నింటినీ కొల్లగొట్టేసిందీ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘బిగ్‌బాస్‌’ షో. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ బుల్లితెరపై సందడి చేయనున్నాడట. అయితే ఈ సారి హోస్ట్‌గా కాదండోయ్‌. గెస్ట్‌గా. బుల్లితెరపై ఆల్రెడీ ప్రసారమవుతున్న మెగా డాన్స్‌ షో ‘ఢీ’ గ్రాండ్‌ ఫినాలేకి ఎన్టీఆర్‌ గెస్ట్‌గా రాబోతున్నాడట.

ఈ షోకి నటి ప్రియమణి, డాన్స్‌ కొరియోగ్రాఫర్స్‌ యానీ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌లు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రాండ్‌ ఫినాలేకి ఎవరో ఒక ప్రముఖ సెలబ్రిటీని తీసుకొస్తుంటారు ‘ఢీ’ టీమ్‌. అలా ఈ సారి ఎన్టీఆర్‌ని తీసుకొచ్చారట. ఎన్టీఆర్‌ తమ షోకి రావడం చాలా ఆనందంగా ఉందనీ హోస్ట్‌ ప్రియమణి చెప్పింది. ఎన్టీఆర్‌ గెస్ట్‌గా రావడమే కాదు, బోలెడంత సందడి సందడి చేశాడట షోలో. ఆ సందడినంతా పంచుకునేందుకు ఆడియన్స్‌ని రెడీగా ఉండమంటోంది ప్రియమణి.

గతంలో ఎన్టీఆర్‌, ప్రియమణి ‘యమదొంగ’ సినిమాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఎన్టీఆర్‌కి బెస్ట్‌ డాన్సింగ్‌ పార్ట్‌నర్స్‌లో ప్రియమణి పేరు ఖచ్చితంగా చేర్చొచ్చు. అలా చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ వీరిద్దరూ సేమ్‌ స్క్రీన్‌పై బుల్లితెరపై కనిపించబోతున్నారు. కనిపించాక ఊరికే ఉంటారా? కాలు కదపరూ. ఈ నెల 18న ఈ షో ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై చేసిన ప్రోమో వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular