HomeMovie News Teluguమల్టీ స్టారర్‌ కా బాప్‌.!

మల్టీ స్టారర్‌ కా బాప్‌.!

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌ కలిసి దిగిన ఫోటో అది. మెగా కోడలు ఉపాసన ఆ ఫోటోని పోస్ట్‌ చేసింది. చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ సినిమాల్లో సంగతి ఎలా ఉన్నా, బయట మంచి ఫ్రెండ్స్‌. వీళ్లే కాదు, హీరోలంతా కూడా సినిమా ప్రపంచం నుండి పక్కకొస్తే, అంతా ఫ్యామిలీ ఫ్రెండ్సే. అభిమానుల్లోనే పొరపొచ్చాలు కానీ, హీరోల్లో ఎలాంటి పొరపొచ్చాలూ ఉండవు. 

ఇదే మాట చాలా సందర్భాల్లో హీరోలు చెబుతున్నప్పటికీ, అభిమానులు పట్టించుకోవడం లేదు. అందుకే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారేమో, టాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీ స్టారర్స్‌ ట్రెండ్‌కి నాంది పడింది. ఆల్రెడీ మహేష్‌ – వెంకటేష్‌, పవన్‌ – వెంకటేష్‌ తదితర ఇలాంటి మల్టీ స్టారర్స్‌ వచ్చినప్పటికీ అవి చాలవు మన అభిమానులకు. తాజాగా చరణ్‌ – ఎన్టీఆర్‌ మెగా మల్టీస్టారర్‌ తెరక్కెనున్న సంగతి తెలిసిందే. అలాగే వెంకీ – వరుణ్‌, నాగ్‌ – నాని ఇలా ఇప్పటికే మల్టీ స్టారర్స్‌ లైన్‌లో ఉన్నాయి. 

అయితే తాజా సమాచారమ్‌ ప్రకారం మరో బిగ్‌ మల్టీ స్టారర్‌కి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూస్తేనే అర్ధమవుతోంది. ఈ ముగ్గురు స్టార్స్‌ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే టన్నుల టన్నుల కిక్‌ వచ్చేస్తోంది కదా. ఆల్రెడీ చరణ్‌ – ఎన్టీఆర్‌ మల్టీ స్టారర్‌ కోసం రాజమౌళి దిగొచ్చాడు. 

ఇప్పుడు మహేష్‌ కూడా మల్టీ స్టారర్‌కి చొరవ చూపిస్తున్నాడట. మరి ఈ ముగ్గురి కాంబినేషన్‌ వర్కవుట్‌ అవ్వాలంటే ఏ డైరెక్టర్‌ దిగి రావాలో కదా. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్‌ సినిమా దిశా దశా మారిపోయినట్లే. ఈ కాంబోకి దర్శకుడు కొరటాల అయితే ఆ కిక్కే వేరప్పా.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular