HomeMovie News Teluguశృతిహాసన్‌ ట్రాక్‌ ఎక్కేసిందోచ్‌.!

శృతిహాసన్‌ ట్రాక్‌ ఎక్కేసిందోచ్‌.!

అందాల భామ శృతిహాసన్‌ చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజీగా గడిపిన శృతిహాసన్‌ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత శృతిహాసన్‌ కొత్త సినిమాకి సైన్‌ చేసింది లేదు. అలాగే తమిళ, హిందీల్లో కూడా. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హిందీలో ఓ సినిమాకి సైన్‌ చేసింది. మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విద్యుత్‌ జమ్వాల్‌ ఈ సినిమాలో శృతిహాసన్‌తో జత కడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది.

ఇకపోతే శృతిహాసన్‌ సినిమాలకు దూరంగా ఉండడం వెనుక అసలు రీజన్‌ తన బోయ్‌ ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సెల్‌తో వివాహం నిశ్చయం కావడమేనని ఈ మధ్య వార్తలు వచ్చాయి. శృతిహాసన్‌ పలు ఫంక్షన్స్‌కి తన బోయ్‌ ఫ్రెండ్‌తో కలిసి అటెండ్‌ అవ్వడం, అక్కడక్కడా మైఖేల్‌తో షాపింగ్స్‌ చేస్తూ కెమెరాకి చిక్కిన దృశ్యాలు తదితర అంశాలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే శృతిహాసన్‌ మాత్రం వాటిని ఖండించేసింది. 

మళ్లీ ఇప్పుడు సినిమాలు ఒప్పుకోవడం షురూ చేసింది. దాంతో శృతి మళ్లీ ట్రాక్‌ ఎక్కేసిందని తెలుస్తోంది. తమిళంలో ఆల్రెడీ శృతిహాసన్‌, తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి నటించిన ‘శభాష్‌ నాయుడు’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక తెలుగులో ఆమె ఒప్పుకోబోయే సినిమాల సంగతి తెలియాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular