HomeMovie News Teluguమిల్కీ బ్యూటీ ఎందుకలా చేసింది?

మిల్కీ బ్యూటీ ఎందుకలా చేసింది?

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన మిల్కీబ్యూటీ తమన్నాకి ప్రస్తుతం అంత సీను లేదని అంటున్నారు. స్టార్‌ హీరోలందరి సరసన నటించేసిన తమన్నా ఇప్పుడు ఖాళీ అయిపోయింది. సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్నవి రెండే ప్రాజెక్టులు. అందులో ఒకటి కళ్యాణ్‌రామ్‌తో నటిస్తున్న ‘నా నువ్వే’ చిత్రం. ఈ చిత్రంలో త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మరో చిత్రం ‘క్వీన్‌’. బాలీవుడ్‌ క్వీన్‌కి ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. నీలకంఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

అయితే ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడిందంటూ గత కొంత కాలంగా గాసిప్స్‌ వస్తున్నాయి. అందుకు కారణం దర్శకుడు నీలకంఠకీ, మిల్కీబ్యూటీకి మధ్యా విబేధాలే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, ఇప్పుడు ఆ సినిమా నుండి దర్శకుడు నీలకంఠ తప్పుకున్నారంటూ మరో గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌ని రమేష్‌ అరవింద్‌ టేకప్‌ చేశారనీ తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఘన విజయం అందుకున్న ‘క్వీన్‌’ చిత్రం దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 

తమిళ, మలయాళ వెర్షన్‌ని రమేష్‌ అరవింద్‌ తెరకెక్కిస్తుండగా, తెలుగు, కన్నడ భాషల్లో నీలకంఠ తెరకెక్కిస్తున్నారు. తాజాగా స్ప్రెడ్‌ అవుతోన్న గాసిప్స్‌ని బట్టి, నీలకంఠ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడంతో, కొన్ని రోజులు తెలుగు క్వీన్‌ షూటింగ్‌ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పట్లో ‘క్వీన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరో పక్క మిల్కీబ్యూటీ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ అయిన మెగాస్టార్‌ ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైన సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular