HomeMovie News Telugu'మహానటి' ముచ్చట మొదలైంది

‘మహానటి’ ముచ్చట మొదలైంది

అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుకతోన్న చిత్రం ‘మహానటి’. ఈ సినిమా టాలీవుడ్‌కే కాదు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు కూడా ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా చరిత్రను గుర్తు చేసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే భారీ స్టార్‌ కాస్టింగ్‌తో అందులోనూ ఈ తరం నటీ నటులతో ఆ తరాన్ని తలపింపచేసేలా ‘మహానటి’ మన ముందుకు రాబోతోంది. తాజాగా సమంత, విజయ్‌ ఆంటోనీల పాత్రల పరిచయాలు అయిపోయాయి. ‘మధురవాణి’ అనే జర్నలిస్టు పాత్రలో సమంత నటిస్తోంది.

విజయ్‌ ఆంటోనీ పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంది. మెళ్లో కెమెరా వేసుకుని, ఆ కాలం నాటి స్కూటర్‌లో తలపై హెల్మెట్‌ పట్టుకుని అచ్చం అలనాటి కాలం నాటి వ్యక్తిలాగే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వారిలో ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషిస్తున్నారనే విషయం తెలియాలంటే ఇంకెంతో టైం పట్టదండోయ్‌. ఈ నెల 14న ‘మహానటి’ టీజర్‌ విడుదల కాబోతోంది. ‘దర్శిని’ పేరుతో ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు.

టీజర్‌ వచ్చిందంటే చాలా వరకూ పాత్రల విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే టీజర్‌ కోసం అంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, దుల్కర్‌ సల్మాన్‌, నాగచైతన్య, ప్రకాష్‌రాజ్‌, షాలినీ పాండే, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న ‘మహానటి’ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular