HomeMovie News Teluguఅందాల 'రాశి'పై కన్నేసిన బెల్లంకొండ!

అందాల ‘రాశి’పై కన్నేసిన బెల్లంకొండ!

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాల్లో హీరోయిన్స్‌కి ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మన హీరో తన సినిమాలకు ఎంచుకునే ముద్దుగుమ్మలంతా బాగా పేరున్న వారు, స్టార్‌డమ్‌ ఉన్నవారే కావడం విశేషం. ఇమేజ్‌లో క్రేజ్‌ ఉన్న హీరోయిన్స్‌ని ఏరి కోరి మరీ తన సినిమాలకు ఎంచుకుంటాడు మనోడు. 

అందుకే తన తాజా చిత్రం కోసం కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ తరహా ఆలోచనలే చేస్తున్నాడట. ఈ సారి బెల్లంకొండ ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్‌ అనే యంగ్‌ డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాడు. ఈ తాజా చిత్రం రేపు అనగా ఫిబ్రవరి 22న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవర్ని ఎంచుకోవాలా అని కొన్ని రోజులుగా బెల్లంకొండ ఆలోచిస్తున్నాడట. అనూహ్యంగా ‘తొలిప్రేమ’ సినిమాతో బిగ్‌ సక్సెస్‌ అందుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. అందుకే మనోడి కన్ను రాశీఖన్నా మీద పడిందట. తన కొత్త సినిమాలో రాశీఖన్నాని హీరోయిన్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాడట. 

చూడాలి మరి బెల్లంకొండ ఈ సారి రాశీకి ఛాన్సిస్తాడేమో. మరో పక్క ఈ సినిమా కోసం బెల్లంకొండ బాలీవుడ్‌ ముద్దుగుమ్మల్ని తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నాడనీ సమాచారమ్‌. ఇదిలా ఉండగా, ప్రస్తుతం బెల్లంకొండ నటిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమా అతి త్వరలోనే పూర్తి కానుంది. మే లో ఈ చిత్రాన్ని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular