HomeMovie News Teluguపవన్‌, మహేష్‌ - మంజులకి ఎవరు ఫస్ట్‌?

పవన్‌, మహేష్‌ – మంజులకి ఎవరు ఫస్ట్‌?

నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని వారమ్మాయి మంజుల ఇప్పుడు మెగాఫోన్‌ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ నుండీ అందరి మనసునే గెలచుకుంటోంది. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మనసుకు నచ్చింది’. 

ఈ సందర్భంగా మంజుల తన మనసులోని మాటల్నిలా అభిమానులతో పంచుకున్నారు. దర్శకత్వంలో వెలుగు వెలగాలన్నది ఎప్పటి నుండో తన కల అనీ, అది ఇన్నాళ్లకు తీరబోతోందనీ మంజుల అన్నారు. నిర్మాతగా ఎన్నో అభిరుచి గల సినిమాలను తెరకెక్కించిన మంజుల దర్శకత్వ శాఖలో చాలా కాలం నుండే పని చేస్తున్నారు. గత కొంత కాలంగా డైరెక్షన్‌లోని మెలకువలను అబ్జర్వ్‌ చేస్తున్నారట, సొంతంగా తాను రాసుకున్న కథతోనే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలనేది మంజుల కోరిక. అలాగే తన సొంత కథతో తన డైరెక్షన్‌ జర్నీ స్టార్ట్‌ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉందనీ అంటోందామె. 

సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి వచ్చిన మంజుల నటనపై ఆశక్తి కన్నా,డైరెక్షన్‌ మీదే ఎక్కువ ప్యాషన్‌ అనీ, అందుకే ఈ రంగం వైపు ఎట్రాక్ట్‌ అయ్యాననీ అంటున్నారు. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తన మనసుకు ఎంతో నచ్చిందనీ, ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాననీ మంజుల అంటున్నారు. అందమైన ప్రేమకథకు, అంతకన్నా అందమైన ప్రకృతి అందాల్ని జత చేసి ఈ సినిమా తెరకెక్కించారట. ఖచ్చితంగా అందరి మనసుల్ని దోచేలా ఉంటుందట. 

మరో పక్క మహేష్‌ కోసం ఓ మంచి కథని సిద్ధం చేస్తాననీ మంజుల చెబుతున్నారు. మహేష్‌తో సినిమా చేయాలని కల గనే చాలా మంది డైరెక్టర్స్‌లో తానూ ఒకదాన్ని అని మంజుల చెబుతున్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ అన్నా తనకెంతో అభిమానమనీ, ఆయన కోసం ఓ కథని ఆల్రెడీ సిద్ధం చేశాననీ మంజుల చెబుతున్నారు. అక్కతో మహేష్‌ ముందుగా సినిమా చేస్తాడా? లేదంటే మంజుల, తమ్ముడికంటే ముందుగా పవన్‌కి కథ చెప్పి ఒప్పిస్తుందా? వేచి చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular