HomeMovie News Teluguరొమాంటిక్‌ కపుల్‌కి 'లవ్‌ స్టోరీ' దొరికినట్లేనా?

రొమాంటిక్‌ కపుల్‌కి ‘లవ్‌ స్టోరీ’ దొరికినట్లేనా?

గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని, 2017లో ఘనంగా వివాహం చేసుకున్న అందాల జంట అక్కినేని నాగ చైతన్య, సమంత. ప్రేమతో దగ్గరైన ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. పెళ్లికి ముందు ‘ఏ మాయ చేశావె’, ‘ఆటోనగర్‌ సూర్య’, తదితర చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 

నానితో ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ అక్కినేని జంట కోసం ఓ రొమాంటిక్‌ స్టోరీని ప్రిపేర్‌ చేశాడట. ఆ స్టోరీని చై శామ్‌ కూడా విన్నారనీ తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరికీ ఆ స్టోరీ తెగ నచ్చేసిందట. పెళ్లి తర్వాత సమంతతో కలిసి ఓ మంచి రొమాంటిక్‌ స్టోరీలో నటించాలని ఉందనీ, చై చాలా సార్లు చెప్పాడు. అది ఇప్పుడు నిజమయ్యేలానే ఉందన్నమాట. అక్కినేని అభిమానులకూ ఈ వార్త సంతోషాన్ని కల్గించేదే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై ఈ జంట ఓ డెసిషన్‌ తీసుకోనున్నారనీ తెలుస్తోంది. మరోవైపు సమంత నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సమంత కీలక పాత్ర పోషిస్తున్న ‘మహానటి’ చిత్రం నిర్మాణ దశలో ఉంది. మరో మూవీ ‘యూటర్న్‌’లోనూ సమంత నటిస్తోంది. ఇవి కాక పలు తమిళ చిత్రాలు సమంత చేతిలో ఉన్నాయి. ఇక చైతూ విషయానికి వస్తే, ప్రస్తుతం చైతూ ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు చివరి దశకు చేరుకుంది ఈ సినిమా షూటింగ్‌. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, మారుతి దర్శకత్వంలో మరో సినిమాకీ కమిట్‌ అయ్యాడు నాగచైతన్య.

You May Like This
- Advertisment -spot_img

Most Popular