HomeMovie News Teluguఉపాసన క్రిస్‌మస్‌ వేడుకల్లో ఎన్టీఆర్‌!

ఉపాసన క్రిస్‌మస్‌ వేడుకల్లో ఎన్టీఆర్‌!

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసనకి క్రిస్మస్‌ సందడి ముందే వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్‌ ట్రీని తయారు చేసి, క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ క్రిస్మస్‌ వేడుకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కుటుంబం హాజరైంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, అభిమానులతో పంచుకుంది. 

ఎన్టీఆర్‌, చిరంజీవి తల్లితో కలిసి ఉన్న ఫోటో ఒకటి, చరణ్‌తో యంగ్‌ హీరో శర్వానంద్‌, ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి తదితరులు సరదాగా దిగిన ఫోటోలు ఉపాసన పోస్ట్‌ చేసింది. ఎన్టీఆర్‌కి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఇప్పుడు మరింత బలపడింది. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, చరణ్‌ ఫ్యామిలీ కలిసి ముందుగానే క్రిస్మస్‌ వేడుకలు సరదాగా జరుపుకున్నారు. 

మరో పక్క ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి ఓ మల్టీ స్టారర్‌లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ మల్టీస్టారర్‌ని తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ కాంబినేషన్‌ని చిత్ర యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, దాదాపు ఈ కాంబోకి తగిన కసరత్తులు తెర వెనుక సూపర్‌ ఫాస్ట్‌గా జరుగుతున్నాయనీ సమాచారమ్‌. అతి త్వరలోనే ఈ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. 

కాగా చరణ్‌ ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందుకోసం ఎన్టీఆర్‌ తన బాడీని షేప్‌ చేస్తున్నాడంటూ ఓ సమాచారమ్‌. 

ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ కొంచెం సన్నబడనున్నాడట. అందుకోసం కసరత్తులు చేస్తున్నాడట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘అజ్ఞాతవాసి’ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాగానే ఎన్టీఆర్‌తో సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular