HomeMovie News Teluguబాలయ్య వయసేంటీ! ఆ ఎనర్జీ ఏంటి!

బాలయ్య వయసేంటీ! ఆ ఎనర్జీ ఏంటి!

వయసు పెరిగే కొలదీ ఎవరికైనా ఎనర్జీ లెవల్స్‌ కొంత సన్నగిల్లుతూ ఉంటాయి. అయితే బాలయ్య విషయంలో మాత్రం ఇది రివర్స్‌ అనే చెప్పాలి. వయసు మీద పడుతున్న కొద్దీ ఆయనలో ఎనర్జీ లెవల్స్‌ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్‌’ సినిమాలో బాలయ్య ఎనర్జీ చూసి అంతా షాక్‌ అయ్యారు. సినిమా ఆశించిన రిజల్ట్‌ ఇవ్వకపోయినా కానీ, సినిమాలో బాలయ్య నటనకు ఆకాశమే హద్దయ్యింది. నటన కన్నా, ఆయన ఎనర్జీ లెవల్స్‌ గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి.

డాన్సులు, ఫైట్స్‌లో ఆయన చూపించిన గ్రేస్‌కి అప్పుడు చిత్ర యూనిట్‌ షాక్‌ తిన్నది. తాజాగా బాలయ్య నటిస్తున్న చిత్రం ‘జై సింహా’. కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘పైసా వసూల్‌’ని మించిన ఎనర్జీతో బాలయ్యని చూడబోతున్నామట. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీకి సంబంధించి ఓ చిన్న హింట్‌ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాట షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతోంది. ఆ పాటకు జానీ మాస్టర్‌ డాన్స్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

జానీ మాస్టర్‌ అంటే చాలా స్పీడున్న డాన్స్‌ మాస్టర్‌. ఆయన డాన్సు స్పీడును అందుకోవడం యంగ్‌ హీరోస్‌కే సాధ్యం అలాంటిది ఆయన కొరియోగ్రఫీలో బాలయ్య స్పీడు చూసి జానీ మాస్టరే ఆశ్చర్యపోయాడట. జానీ మాస్టర్‌కే షాక్‌ ఇచ్చాడంటే, బాలయ్య సినిమాలో ఏ రేంజ్‌లో తన ఎనర్జీని చూపించి ఉంటాడో కదా. బాలయ్యతో ఉన్న ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ జానీ మాస్టర్‌ ఈ విషయాలు పంచుకున్నారు. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ ఈ సినిమాలో బాలయ్యతో జత కడుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular