HomeMovie News Teluguతనీష్‌ రిక్వెస్ట్‌ మా జీవితాల్తో ఆడుకోవద్దు

తనీష్‌ రిక్వెస్ట్‌ మా జీవితాల్తో ఆడుకోవద్దు

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం కొందర్ని కలచి వేస్తోంది. ఇప్పటికే 15 మందిని అనుమానితులుగా భావించి, ఎక్సైజ్‌ శాఖ నోటీసులు జారీ చేసింది. వారిలో యంగ్‌ హీరోలు నందూ, తనీష్‌ తదితరులు ఉన్నారంటూ వారికి ఎక్జైజ్‌ శాఖ నుండి నోటీసులు అందాయంటూ మీడియా వారి పేర్లను పదే పదే స్క్రోలింగ్‌ వేస్తూంటే, సదరు యంగ్‌ హీరోలు మీడియా ముందుకొచ్చి అర్థిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ మాఫియాకి, తమకీ ఎలాంటి సంబంధం లేదంటూ, తమ పేర్లను, ఫోటోలను పదే పదే ఛానెల్స్‌లో చూపించొద్దు ప్లీజ్‌ అంటూ మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నారు.

‘నచ్చావులే’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తనీష్‌ డ్రగ్స్‌ కేసులో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తనీష్‌ మీడియా ముందుకొచ్చి, ‘దీనికీ, నాకూ ఎలాంటి సంబంధం లేదనీ, తన పేరు ఛానెల్‌లో చూసి అమ్మ చాలా బాధపడుతోంది.. ప్లీజ్‌ తన పేరు అలా ఛానెల్స్‌లో స్క్రోల్‌ చేయద్దు.. ‘అని మీడియాని వేడుకున్నాడు తనీష్‌. తనీష్‌ తండ్రి ఈ మధ్యనే మరణించారు. దాంతో ప్రస్తుతం కుటుంబం బాధ్యత అంతా తనదేనంటూ, కుటుంబ పెద్దని కావడం వల్ల తనకి చాలా బాధ్యతలున్నాయనీ, డ్రగ్స్‌ తీసుకోవాల్సిన అవసనరం తనకి లేదంటూ తనీష్‌ చెప్పాడు.

ఇలాంటి గాసిప్స్‌ తన కెరీర్‌ని దెబ్బ తీసే అవకాశాలున్నాయి. అలాగే తన కుటుంబ సభ్యులను చాలా బాధిస్తున్నాయి అన్నాడు యంగ్‌ హీరో తనీష్‌. హీరో కాకముందు పలు చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాడు తనీష్‌. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular