HomeMovie News Teluguరూటు మార్చుతున్న కళ్యాణ్‌రామ్‌?

రూటు మార్చుతున్న కళ్యాణ్‌రామ్‌?

జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా సినిమా రూపొందనుంది. నిర్మాతగా తమ్ముడు ఎన్టీయార్‌తో ‘జై లవ కుశ’ సినిమా తెరకెక్కిస్తున్న కళ్యాణ్‌రామ్‌, హీరోగా తన కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. డైరెక్టర్‌గా జయేంద్ర గతంలో సిద్దార్ధ హీరోగా ‘180’ అనే సినిమా తెరకెక్కించాడు. ఇదో డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌ కోసం రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించనున్నాడట. ‘ఇజం’ సినిమాతో ఫెయిల్యూర్‌ చవిచూశాడు కళ్యాణ్‌రామ్‌.

అంతకు ముందు ‘షేర్‌’ కూడా పరాజయమే మిగిల్చింది కళ్యాణ్‌రామ్‌కి. తన కెరీర్‌లో ‘పటాస్‌’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది కళ్యాన్‌ రామ్‌కి. మళ్లీ ‘పటాస్‌’ లాంటి హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ నందమూరి హీరో. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో కథ ఉండడంతో కళ్యాన్‌రామ్‌కి ఎంతో నచ్చి జయేంద్రతో సినిమాని ఓకే చేశాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. మరో పక్క నిర్మాతగా తమ్ముడు ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘జై లవకుశ’ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. హీరోగా నటిస్తూనే, నిర్మాతగా కూడా తన బాధ్యతలు నెరవేరుస్తానంటున్నాడు. ఇంతవరకూ తన సినిమాలకే నిర్మాతగా ఉన్న కళ్యాన్‌రామ్‌ తొలిసారిగా ఎన్టీఆర్‌ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో ఈ రెండు పడవల నడకలో ఎంత మేర విజయం సాధిస్తాడో చూడాలి మరి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular