HomeMovie News Telugu'దంగల్‌' అక్కడ 500 కోట్లు దాటేస్తోంది

‘దంగల్‌’ అక్కడ 500 కోట్లు దాటేస్తోంది

ఇటీవల చైనాలో విడుదలైన ‘దంగల్‌’ సినిమా సంచలనాలు సృష్టించేస్తోంది. విడుదలైన రోజు నుండే రికార్డులు మొదలెట్టేసింది. అక్కడ ఇప్పటికే 400 కోట్లు దాటేసింది. ఇంకా విజయవంతంగా రన్‌ అవుతోంది. త్వరలోనే 500 కోట్లు దాటేయడానికి పరుగులు తీస్తోంది. ఏ క్షణాన అయినా 500 కోట్లు మార్క్‌ దాటేయవచ్చునని అంచనా వేస్తున్నారు ట్రేడ్‌ పండితులు. అమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం, ‘బాహుబలి-2’ వచ్చేదాకా ఇండియాలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

అంత వరకూ 800 కోట్ల పైన వసూలు చేసిన ‘దంగల్‌’ చైనాలో విడుదలయ్యాక వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ప్రస్తుతం ‘బాహుబలి-2’తో పోటీ పడుతోంది ‘దంగల్‌’. అయితే చైనాలో విడుదల చేయాలన్న నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడంతో వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించిన తొలి చిత్రంగా రికార్డులకెక్కే అవకాశం తృటిలో కోల్పోయింది ‘దంగల్‌’. చైనాలో ఈ సినిమాని ముందుగానే విడుదల చేసుంటే ఆ రికార్డు మొదటగా ఈ సినిమాకే దక్కేదని బాలీవుడ్‌ అంచనా.

రెజ్లింగ్‌ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాని మెచ్చుకోని వారు లేరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇలాంటి సినిమాల్ని అందరూ ఆదరించి తీరాలి. అమీర్‌ ఖాన్‌ చేసిన సాహసం వృధా పోలేదు. నలుగురు కూతుళ్లకు తండ్రిగా అమీర్‌ ఖాన్‌ నటన అద్భుతహ అనిపిస్తుంది ఈ సినిమాలో. అందుకే ఈ సినిమా రికార్డులకు నెలవైంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular