HomeMovie News Teluguఓం నమో వేంకటేశాయ పై 'చిరు' స్పందన!!

ఓం నమో వేంకటేశాయ పై ‘చిరు’ స్పందన!!

అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. కొన్ని వందల‌ సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి, . ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా . సినీ ప్ర‌ముఖుల కోసం స్పెష‌ల్ షోను ప్ర‌ద‌ర్శించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా చూడ‌ట‌మే వండ‌ర్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. భ‌క్తి పార‌వ‌శ్యాలు పెల్లుబుకుతాయి. సెకండాఫ్ హృధ్యంగా ఉండ‌ట‌మే కాదు, సెకండాఫ్ అంతా క‌ళ్ళు చెమ‌ర్చాయి. ప్రతి స‌న్నివేశం అద్భుతంగా ఉంది. సినిమా చూడ‌టం భ‌క్తితో కూడిన ప్ర‌యాణం చేసిన‌ట్టు అనిపించింది. ఇలాంటి సినిమా తీయాలంటే రాఘ‌వేంద్ర‌రావుగారు, చెయ్యాలంటే నా మిత్రుడు నాగార్జున‌, తెర‌కెక్కించాలంటే నిర్మాత మ‌హేష్‌రెడ్డికే చెల్లుతుంది. గ‌తంలో అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడీసాయి చిత్రాల‌కు ధీటుగా ఉండే చిత్రం. నాగార్జున కెరీర్‌లో క‌లికుతురాయిలాంటి చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ. రాఘ‌వేంద్ర‌రావుగారు అద్భుతంగా తీస్తే..న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇంకా గొప్ప‌గా చేశారు. సినిమా చూస్తే దివ్యానుభూతికి లోన‌వుతారు“ అన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular