HomeMovie News Teluguఎన్టీయార్‌ ఓటు ఎవరికి?

ఎన్టీయార్‌ ఓటు ఎవరికి?

‘జనతా గ్యారేజ్‌’ సినిమాతో ఓ రేంజ్‌లో హిట్‌ కొట్టేసిన ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కోసం చాలా కథలు విన్నాడు. అలాగే గ్యాప్‌ కూడా ఎక్కువే తీసుకున్నాడు. చివరికి బాబీతో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ రోల్‌లో నటించనున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. అదే కనుక జరిగితే ఇంతవరకూ ట్రిపుల్‌ రోల్‌ చేసింది మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే. ఆ తర్వాతి స్థానం ఎన్టీఆర్‌దే అవుతుంది. ఈ సినిమాకి ‘జయ్‌ లవ్‌ కుశ్‌’ అని టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు.

కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి కళ్యాణ్‌రామ్‌ నిర్మాత. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం కాబట్టి, ఆయనతో రొమాన్స్‌ చేసేందుకు ముగ్గురు ముద్దుగుమ్మలు కావాలి. అందుకే ఈ సినిమాలో హీరోయిన్స్‌ కోసం చిత్ర యూనిట్‌ ఓ పెద్ద లిస్టునే తయారు చేసింది. ఆ లిస్టులో తమన్నా, కాజల్‌, రకుల్‌, శృతిహాసన్‌, అనుపమా పరమేశ్వరన్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి హన్సిక, రాశీఖన్నాల పేర్లు వచ్చి చేరాయి.

గతంలో హన్సిక ‘కంత్రీ’ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించింది. రాశీఖన్నా ఇంతవరకూ ఎన్టీఆర్‌తో జత కట్టలేదు. ఇక పైన చెప్పిన వారిలో అనుపమా పరమేశ్వరన్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా ఎన్టీఆర్‌తో కొత్తగా రొమాన్స్‌ చేయాల్సిన వారే. అయితే వీరిలో ఎవరిని తనకి జంటగా ఎంచుకోవాలనే నిర్ణయాన్ని చిత్ర యూనిట్‌ ఎన్టీఆర్‌కే వదిలేసిందట. వీరిలో ఎన్టీఆర్‌ ఏ ముద్దుగుమ్మకి ఓటేస్తే వారే ఫైనల్‌ అయ్యేది. చూద్దాం ఎన్టీఆర్‌తో చిందేసే అదృష్టం ఎవరిని వరిస్తుందో! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular