HomeMovie News Teluguముద్దుల మొనగాడీ టాలీవుడ్‌ కుర్రోడు

ముద్దుల మొనగాడీ టాలీవుడ్‌ కుర్రోడు

ఎవరీ ముద్దుల మొనగాడు అనుకుంటున్నారా? అదేనండీ మొన్న ‘పెళ్లిచూపులు’ సినిమాతో అనుకోకుండా సెన్సేషనల్‌ హిట్‌ కొట్టేసి, రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు కదా. ఆ కుర్రోడే విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు ఈ కుర్రోడు చేస్తున్న తాజా సినిమా ‘ద్వారక’. ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. అయితే ఇందులో ఏముంది స్పెషల్‌ అనుకుంటున్నారా? అబ్బాయి సరదాగా ఓ కామెంట్‌ వేశాడు.

బాలీవుడ్‌ బాబులేనా లిప్‌లాక్స్‌ చేసేది ఏమి మనం చేయలేమా? వాళ్లేనా ముద్దుల మొనగాళ్లు అని నవ్వుతూ వేసిన కామెంట్‌ ఇప్పుడు సీరియస్‌గానే వైరల్‌ అవుతోందండీ. బాలీవుడ్‌లో లిప్‌లాక్స్‌ చాలా సహజం. అయితే మన టాలీవుడ్‌కి వచ్చేసరికి కొన్ని పరిమితులున్నాయి. అయితే మనోడు సరదాగానే వేశాడులెండి ఈ సెటైరు. తాజా మూవీ ‘ద్వారక’లో మనోడికి హీరోయిన్‌తో రెండు మూడు ముద్దు సీన్లున్నాయట లెండి. అంతేకాదు మరో సినిమా ‘అర్జున్‌ రెడ్డి’లో కూడా మనోడు ముద్దులతో రెచ్చిపోయాడట.

అందుకే మరి వరుసగా ఈ ముద్దుసీన్లు ఏంటి? అని అడిగిన ప్రశ్నకి మనోడు సరదాగా ఇచ్చిన సమాధానం పై మాట. మొత్తానికి మనోడు సూపర్‌ ఫాస్ట్‌గానే ఉన్నాడనిపిస్తోంది ఈ విషయంలో. శ్రీనివాస్‌ రవీందర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృష్ణానంద స్వామి అనే దొంగ బాబా పాత్రలో నటిస్తున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular