HomeMovie News Teluguప్రియాంకా నువ్వు కేక అవునా? కాదా?

ప్రియాంకా నువ్వు కేక అవునా? కాదా?

బహిరంగ వేడుకల్లో ముద్దుగుమ్మలు మోడ్రన్‌ దుస్తుల్లో మెరిసిపోవడం మామూలే. ఈ తరహా వేడుకల్లో అందరి దృష్టినీ ఏ రకంగా ఆకర్షించాలో ఆ రకంగా ముద్దుగుమ్మలు డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌ని సెర్చ్‌ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌ ఏంజిల్‌ ప్రియాంకా చోప్రా కాస్ట్యూమ్‌ ఓ హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాజాగా జరిగిన ఆస్కార్‌ ఫంక్షన్‌కి ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా హాజరయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్‌లో కూడా తన పాదం మోపింది.

మోపడమేంటి, అక్కడ ఓ రేంజ్‌లో తన సత్తా చాటుతోంది. ‘క్వాంటికో’ సీరియల్‌ ద్వారా అక్కడి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తాజగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘బేవాచ్‌’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాంటిది ఆస్కార్‌ ఫంక్షన్‌కి ప్రియాంకా వస్తోందని తెలియగానే ఆమె ఏ కాస్టూమ్‌లో దర్శనమిస్తుందో అంటూ ఆమె అభిమానులు తెగ అంచనాలు వేసేశారు. అయితే అభిమానుల అంచనాల్ని ప్రియాంకా అందుకుందా లేదా అనేది మాత్రం సోషల్‌ మీడియా రెస్పాన్స్‌ని బట్టి ఆమెకే తెలియాలి.

ఎందుకంటే సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అంతా ప్రియాంకా ‘ఆస్కార్‌ గౌను’ గురించే మాట్లాడుతున్నారు. వట్టి మాటలా అవి, రకరకాల కామెంట్లు. పోజిటివ్‌, నెగిటివ్‌ రెండూనూ, మరి ఎందుకింతగా ప్రియాంక తన ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిందో తెలీడం లేదు. మొత్తానికి కొంచెం కొత్తగా ట్రై చేయాలని తలంచి, ప్రియాంక తన కాస్టూమ్‌ విషయంలో కొంచెం తడబడిందేమో అనిపిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular