HomeMovie News Teluguమెగాస్టార్‌ సెంచరీ కొట్టేది రేపేనా?

మెగాస్టార్‌ సెంచరీ కొట్టేది రేపేనా?

మెగాస్టార్‌ 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో 100 కోట్ల మార్కెట్‌కి దగ్గరగా వచ్చాడన్న సంగతి తెలిసిందే. అయితే 100 కోట్లకు దగ్గరగా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి. నేడు లేదా రేపు ఆ 100 కోట్ల షేర్‌ని టచ్‌ చేస్తాడని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఇంతవరకూ 100 కోట్లు కొల్లగొట్టిన తొలి హీరో అవుతాడు మెగాస్టార్‌ చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఈ మార్క్‌ టచ్‌ చేసిన తొలి సినిమా ‘బాహుబలి’ మాత్రమే.

గ్రాస్‌ పరంగా ఎప్పుడో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’తో రికార్డుల్ని బద్దలుగొట్టేశారు. షేర్‌ పరంగా ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు మెగాస్టార్‌. చిరంజీవి రీ ఎంట్రీలో వచ్చిన మూవీకి ఈ మార్కెట్‌ ఊహించనిది. అలాంటిది చాలా ఈజీగా మెగాస్టార్‌ ఈ మార్కెట్‌ని క్రాస్‌ చేసేశాడు. ఇదే జోరు చిరంజీవి ఇకపై కూడా కొనసాగించనున్నాడు. వెంటనే తన తదుపరి సినిమా మెగాస్టార్‌ చిరంజీవి స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డితో చేస్తున్నాడు. రామ్‌ చరణ్‌ ఈ సినిమాకి నిర్మాత.

అలాగే మరిన్ని మంచి సబ్జెక్టులు చిరంజీవి చేయబోయే సినిమాల లైన్‌లో ఉన్నాయి. అందులో ఒకటి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సినిమా. ఈ సినిమాలో చిరంజీవి నటిస్తే అది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా వినాయక్‌ లేదా బోయపాటి శీను డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించే అవకాశాలున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular