HomeMovie News Teluguషారుక్ ఖాన్ ‘రైస్’ సినిమా ప్రమోషన్సలో విషాదం

షారుక్ ఖాన్ ‘రైస్’ సినిమా ప్రమోషన్సలో విషాదం

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం రైస్ రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇందులో భాగంగానే షారుక్ ముంబై నుండి ఢిల్లీ వరకు ట్రైన్ లో ప్రయాణిస్తూ ‘రైస్’ చిత్రన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి వడోదరా స్టేషన్ లో ట్రైన్ ఆగినప్పుడు ఒక్కసారిగా కింగ్ ఖాన్ అభిమానులు ట్రైన్ చుట్టూ గుమిగూడారు. ఆ సమయంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. 10నిమిషాల తరువాత ట్రైన్ వెళ్ళిపోయాక అందరు ఒకేసారి స్టేషన్ బయటకు రావడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఫరీద్ ఖాన్ శేరాణి అనే అభిమాని ఊపిరాడక మృతి చెందాడు. ఫరీద్ షారుఖ్ కి వీరాభిమాని, నిన్న కూడా అతని భార్య కూతురితో తన అభిమాన హీరోని చూడడానికి వచ్చి ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ విషయం తెలుసుకున్న షారుఖ్ అలాగే రైస్ టీం మరణించిన ఫరీద్ కి తమ ప్రగాడ సానుభూతిని తెలిపింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular