HomeMovie News Teluguప్రముఖ హీరోయిన్ కోర్టు మెట్లెక్కింది!

ప్రముఖ హీరోయిన్ కోర్టు మెట్లెక్కింది!

ప్రముఖ హీరోయిన్ విజయశాంతి ఉరఫ్ రాములమ్మ ఈరోజు కోర్టు మెట్లెక్కింది.

వివరాల్లోకి వెళితే, విజయశాంతి తెరాసలో ఉన్నప్పుడు తెలంగాణా కోసం జరిగిన పోరాటంలో లకిడీకపూల్ రైల్వే స్టేషన్ ముట్టడి జరిపిన నేపధ్యంలో తనపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ నిమిత్తమై రాములమ్మ కోర్టుకి రావడం జరిగింది. అయితే న్యాయమూర్తి ఈ కేసుని వచ్చే నెలకి వాయిదా వేశారు.

ఈ సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు రాజకీయాలపై ప్రశ్నించగా తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న వారు మాత్రం రాములమ్మ తెరాసను వదిలి చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపం పడ్డం తప్ప ఏమి చేయగలదు అని నిట్టూర్పు విడుస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular