HomeMovie News Teluguవీళ్లిద్దరూ ఓకే, మరి వాళ్లిద్దరో

వీళ్లిద్దరూ ఓకే, మరి వాళ్లిద్దరో

సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య హిట్స్‌ కొట్టేశారు. ఒకరు 150వ సినిమాతోనూ, మరొకరు 100వ చిత్రంతోనూ న్యూ ఇయర్‌కి మంచి వెల్‌కమ్‌ చెప్పారు. కలెక్షన్స్‌ విషయంలో ఈ ఇద్దరూ బాక్సీఫీస్‌ వద్ద జోరు ప్రదర్శిస్తున్నారు. నువ్వా నేనా అనే రేంజ్‌లో పోరు సాగుతోంది. ఇక సీనియర్‌ హీరోల్లో మన్మధుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ ఉన్నారు. వీళ్లిద్దరూ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నాగార్జున ‘నమో వేంకటేశాయ’ సినిమాతోనూ, వెంకీ ‘గురు’ సినిమాతోనూ జోరు మీదున్నారు రేస్‌లో పాల్గొనడానికి. గతంలో సంక్రాంతి పండక్కి ఈ నలుగురు హీరోలు పోటీ పడేవారు. అలాంటిది చిరంజీవి రేస్‌లో లేకపోవడం ఈ పోటీ కూడా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే చాలా కాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ అలాంటి పోటీ నెలకొంది. అసలు ఈ నలుగురు హీరోలు ఈ సారి సంక్రాంతి రేస్‌లో ఉండబోతున్నారని భావించారంతా.

కానీ ఈ ఇద్దరు రేస్‌ నుండి తప్పుకోవడం వల్ల వార్‌ మెగాస్టార్‌కీ, లయన్‌కీ మధ్య మాత్రమే జరిగింది ఈ రెండు సినిమాలు సక్సెస్‌ కావడంతో వరుసగా కలెక్షన్ల లెక్కలు మొదలెట్టేశాయి. సంక్రాంతి పండగ హడావిడి అయిపోయినా కానీ, ఇంకా కలెక్షన్ల లెక్కలు మాత్రం తేలడం లేదు. వీరి లెక్కల పద్దులు మాట ఇలా ఉండగా, మరి నెక్స్ట్‌ వార్‌కి కూడా రంగం సిద్ధమైపోతోంది. అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు పోటా పోటీగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular