HomeMovie News Teluguచిరంజీవి ఫ్లెక్సీలు ధ్వంసం...

చిరంజీవి ఫ్లెక్సీలు ధ్వంసం…

మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన సంఘటన కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే, కృష్ణ జిల్లా కైకలూరు మండలం అటపాక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు చిరంజీవి అలాగే వంగవీటి రంగా ఫ్లెక్సీలు చించేసారు. ఈ నేపధ్యంలో గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే భీమవరం-కైకలూరు రహదారి దిగ్బంధం చేసి తమ నిరసన తెలియచేసారు.

విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు నిరసన జరుగుతున్న చోటకి చేరుకొని అభిమానులని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. కాని వారు పోలీసులు మాట వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఉన్నత అధికారుల జోక్యంతో నిరసన విరమించారు. అలాగే నిందితులని వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు అభిమానులకి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఖైదీ నెం 150 చిత్రం 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular