HomeMovie News Teluguఅఖిల్, ప్రశాంత్ కాంబో పై క్లారిటీ

అఖిల్, ప్రశాంత్ కాంబో పై క్లారిటీ

అక్కినేని నట వారసుడు అఖిల్ లాంగ్ గ్యాప్ తరువాత ‘లెనిన్’ మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ అఖిల్ ప్రాజెక్ట్స్ పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ – అఖిల్ కాంబో పట్టాలెక్కనున్నట్లు ఫిలిం నగర్ టాక్. దీనికి కారణం తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో అఖిల్, నీల్ మీటింగ్ పెట్టుకోవటమే. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ప్రచారానికి రెక్కలు వచ్చాయి.

దీనితో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నీల్ తో అని అంతా కన్ఫర్మ్ అయిపోయారు. మొత్తానికి అఖిల్ మంచి ఛాన్స్ కొట్టేశాడని శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. అఖిల్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసిన మాట నిజమే. కానీ ఇది జనరల్ మీటింగ్ అని సినిమా కోసం కాదని క్లారిటీ వచ్చింది. లెనిన్ తరువాత అఖిల్ మూవీ ఇంకా ఏదన్నది డిసైడ్ అవలేదని, ప్రజంట్ అఖిల్ లెనిన్‌ పైనే పూర్తిగా దృష్టి సారించాడని అతని టీమ్ క్లారిటీ ఇచ్చింది. నెక్స్ట్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయని ఫైనల్ అయ్యాకా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని తెలిపారు.

‘లెనిన్’ మూవీలో అఖిల్ ఫస్ట్ టైం మాస్ హీరోగా నటిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా లెనిన్ తెరకెక్కుతోంది. మురళీకృష్ణ అబ్బూరు దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 2026 ఫిబ్రవరి లో లెనిన్ ఆడియన్స్ ముందుకు వస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular