HomeMovie News Teluguశర్వా బైక్ కి బ్రేక్ లు వేసిన రాజశేఖర్

శర్వా బైక్ కి బ్రేక్ లు వేసిన రాజశేఖర్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. బైకర్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కంప్లీట్ మేకోవర్ చేంజ్ చేసాడు శర్వానందు. సన్నగా సిక్స్ ప్యాక్ తో మెస్మరైజింగ్ లుక్ లో ఫాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. ఈ మూవీలో శర్వా బైకర్ గా కనిపిస్తున్నాడు. బైకర్ లో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. సీనియర్ హీరోలంతా ఎప్పుడో విలన్స్ గా సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ కూడా విలన్ ప్రయత్నాల్లో ఉన్నారు.

అయితే ఇప్పుడు బైకర్ మూవీ రిలీజ్ రాజశేఖర్ కారణంగా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. కారణం రాజశేఖర్ బైకర్ సెట్స్ లో గాయపడినట్లు టాక్. బైకర్ సెట్ లో సీన్ షూట్ చేస్తుండగా రాజశేఖర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా రాజశేఖర్ కాలికి సర్జరీ జరిగినట్లు సమాచారం. రాజశేఖర్ కూడా డాక్టర్ కావటంతో రెండు గంటలు జరిగిన సర్జరీ కి పూర్తిగా సహకరించారని ఆర్థోపెడిక్ టీమ్ పేర్కొంటూ, సర్జరీ బాగా జరిగిందని, రాజశేఖర్ బాగా కోలుకున్నారని తెలిపారు.

సర్జరీ తరవాత డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని సూచించారట. నాలుగు వారాలు పాటు రాజశేఖర్ కి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారట. అందుకనే రాజశేఖర్ పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ లో జాయిన్ అవలేరని తెలుస్తోంది. ఇంచు మించుగా జనవరి 2026లో తిరిగి సెట్స్‌ పైకి వస్తారని తెలుస్తోంది. ఈ కారణంగా బైకర్ మూవీ షూటింగ్ కి బ్రేకుల పడినట్టే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular