నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2 తాండవం’ (Akhanda 2 Thandavam) డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.
సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో, చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. పలు ప్రాంతాల్లో ఈవెంట్‌లు నిర్వహించి సినిమా హైప్‌ను పెంచుతున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ఈవెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని, ఈ విషయం దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, రేవంత్ రెడ్డి అఖండ 2 ఈవెంట్‌కి రావడం చిత్రబృందానికి పెద్ద బూస్ట్‌గా మారనుంది.
అదే సమయంలో, ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను కూడా ఆహ్వానించే యత్నం జరిగిందట. కానీ బన్నీ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవచ్చని, అన్ని అనుకున్నట్టు జరిగితే సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్ హాజరవుతారని టాక్.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి (Adhi Pinisetty) విలన్‌గా కనిపించనున్నారు. సంగీతం తమన్ (Thaman) అందిస్తున్నారు.





