భారత యానిమేషన్ సినిమా చరిత్రలో తొలిసారి ఒక యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ బరిలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ‘మహావతార్ నరసింహ’ 2026 ఆస్కార్స్‌లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి అర్హత సాధించింది.
పలు దేశాల నుంచి మొత్తం 35 యానిమేటెడ్ చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా, వాటిలో భారతదేశం నుంచి ఎకైక ఎంట్రీగా ‘మహావతార్ నరసింహ’ నిలవడం విశేషం.

అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేషన్ మైథాలజికల్ డ్రామా, శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా రూపొందింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ప్రేమించిన ఈ చిత్రం, హోంబలే ఫిలిమ్స్ విడుదలలో, దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌పై రూపొందించి ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు ఆస్కార్ వేదికపై భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోంది.

2026 ఆస్కార్ నామినేషన్లు వచ్చే సంవత్సరం జనవరి 22న ప్రకటించబడతాయి. ఆస్కార్ అవార్డుల ప్రధాన వేడుక మార్చి 15న నిర్వహించబడుతుంది.





