గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవితేజ (Ravi Teja), ఈసారి విజయం సాధించాలని భారీ ఆశలతో ‘మాస్ జాతర’ (Mass Jathara)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అనేక వాయిదాల అనంతరం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాలు ఉన్నప్పటికీ రోటీన్ స్టోరీతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. వసూళ్ల పరంగా కూడా సినిమా పెద్దగా రాణించలేదు. దీంతో ‘మాస్ జాతర’ రవితేజ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మారింది.

ఇకపోతే, ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందన్న వార్తలు ఇప్పటికే వైరల్ అయినా.. ఏ యాప్‌లో కనిపించకపోవడంతో ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు.
ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం.. ‘మాస్ జాతర’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
అధికారికంగా ప్రకటిస్తూ “మాస్ మహారాజా మీ ఇంట్లో జాతర సృష్టించడానికి వచ్చేస్తున్నారు.. నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతోంది.”
థియేటర్ రిలీజ్‌కి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీలోకి రావడం గమనార్హం.





